బనగానపల్లె మండలం టంగుటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని బనగానపల్లి 5 రవ్వలకొండ సమీపాన మోడల్ స్కూల్ నందు బాల బాలికలకు స్క్రీనింగు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శివ శంకరుడు శనివారం మాట్లాడుతూ.. పిల్లలు పౌష్టిగా ఆహారము లోపం, రక్తహీనత మరియు పౌష్టిక ఆహార సమస్యలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అదేవిధంగా జ్వరం, దగ్గు, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం, ఎదుగుదల లేకపోవడం మొదలగునవి సమస్యలు ఉంటే డాక్టర్ గారిని సంప్రదించి తగు సూచనలు సలహాలు తీసుకోవలసినదిగా వారు తెలియజేశారు.