కడప: సీపీ బ్రౌన్ గ్రంథాలయ నిర్మాణానికి ఆటంకం కలిగిస్తున్న వైసీపీ నాయకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి : TNSF
Kadapa, YSR | Sep 17, 2025 కడపలో సీపీ బ్రౌన్ గ్రంథాలయ నిర్మాణానికి ఆటంకం కలిగిస్తున్న వైసీపీ నాయకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని TNSF జిల్లా అధ్యక్షుడు బొజ్జ తిరుమలేశ్ డిమాండ్ చేశారు. కడపలో ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. వైసీపీ నాయకులు కమిషన్ల కోసం కాంట్రాక్టర్లను బెదిరించి అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇటువంటి నాయకులను నగర బహిష్కరణ చేయాలని హెచ్చరించారు.