బేతంచెర్ల మండలం లో ఎంజిపి పరీక్షకు 146 మంది విద్యార్థులు హాజరు
Dhone, Nandyal | Apr 12, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల మండల పరిధిలోని గోరుమాను కొండ సమీపాన ఉన్న ఎంజేపీలో 5వ తరగతి ప్రవేశ పరీక్షకు 999 మంది విద్యార్థులకు 853 మంది పరీక్షలు రాసినట్లు ఎంఈవో సోమశేఖర్ తెలిపారు. 146 మంది పరీక్షలకు గైర్హాజరైనట్లు తెలిపారు. అలాగే మోడల్ స్కూల్లో 6 తరగతి ప్రవేశ పరీక్షకు 118 మంది విద్యార్థులకు 113 మంది పరీక్షలు రాశారన్నారు. ఐదుగురు విద్యార్థులు పరీక్షకు హాజరు కాలేదన్నారు.