నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లాలో పలుచోరీలకు పాల్పడిన దొంగ అరెస్ట్, రూ. 15 లక్షల విలువైన బంగారు, వెండి నగలు స్వాధీనం
Nandyal Urban, Nandyal | Apr 3, 2026
నంద్యాల జిల్లాలో పలు పోలీసు స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడిన నిందితుడిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. రూ.15 లక్షల విలువచేసే బంగారం, వెండి ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ సునీల్ షోరాణ్ మాట్లాడుతూ.. నంద్యాలకు చెందిన షేక్ బాబావలి పలు స్టేషన్ల పరిధిలో చేసిన దొంగతనాల కేసులలో ముద్దాయిగా ఉన్నాడన్నారు. 98 గ్రాముల బంగారం, 400 గ్రాముల వెండి వస్తువుల స్వాధీనం చేసుకున్నారు