పలమనేరు: పలమనేరు:రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ కు 2000 కోట్లు నిధులు కేటాయించాలని RDOకు అర్జీ అందించిన రెడ్డి అభ్యుదయ సంక్షేమ సంఘం
పలమనేరు: ఆర్డీవో కార్యాలయం వద్ద రెడ్డి అభ్యుదయ సంక్షేమ సంఘం కమిటీ సభ్యులు తెలిపిన సమాచారం మేరకు. ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ కు 2000 కోట్ల నిధులు కేటాయించాలని, తద్వారా రెడ్డి యువతకు మరియు పేద రెడ్డి సోదరులకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ పలమనేరు ఆర్డిఓ భవానికి వినతి పత్రం అందించారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి చేరవేయాల్సిందిగా ఆర్డీవోను కోరామమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెడ్డి సంఘం అడ్వైజర్ అమర్నాథ్ రెడ్డి మరియు రెడ్డి అభ్యుదయ సంక్షేమ సంఘం అధ్యక్ష కార్యదర్శులు సభ్యులు పాల్గొన్నారు.