నారాయణపేట జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయ ప్రజావాణిలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 20 ఫిర్యాదులు వచ్చినట్లు జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ సీను ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన పిర్యాదులకు తగిన ప్రాధాన్యత ఇచ్చి సత్వర పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ సూచించారు.