హుస్సేన్‌సాగర్‌లో తొలిసారిగా ట్రైబల్ కానో స్ప్రింట్ నేషనల్ ఛాంపియన్ షిప్ ప్రారంభమైంది. మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ డిప్యూటీ సెక్రటరీ గణేశ్ నాగరాజన్ ఈ పోటీలను ప్రారంభించారు. ఈపోటీల్లో దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల నుంచి గిరిజన విద్యాసంస్థల్లో శిక్షణ పొందిన అండర్-16, అబోవ్-16 క్రీడాకారులు పాల్గొంటున్నారని, పతకాలు సాధించినవారికి అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ ఇప్పిస్తామన్నారు.