ఒంగోలు అర్బన్: పేద ప్రజల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంతో రాష్ట్రం ముందుకు పోతుంది: జిల్లా ఇన్చార్జి మంత్రి రామ్ నారాయణ రెడ్డి
Ongole Urban, Prakasam | Apr 2, 2026
ఎన్నో ఆర్ధిక ఒడుదుడుకులు, ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికినీ పేద ప్రజల సంక్షేమం, అభివృద్దే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం ముందుకు పోతున్నట్లు రాష్ట్ర దేవాదాయమ శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. గురువారం సాయంత్రం ఒంగోలు జీజీహెచ్ ఆడిటోరియంలో జరిగిన జిల్లా స్థాయి బడ్జెట్ అవుట్ రీచ్ క్యాంపెయిన్ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మరియు జిల్లా ఇంచార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి స్వామి, తదితరులు పాల్గొన్నారు