భద్రాచలం: చర్ల మండలం ఆర్ కొత్తగూడెం వికాస్ బ్యాంక్ లో మేనేజర్ నియమించాలంటూ గ్రామస్థులు,గిరిజన సంఘాల నాయకులు ధర్నా
చర్ల మండలం ఆర్ కొత్తగూడెం గ్రామీణ వికాస్ బ్యాంక్ లో మేనేజర్ నియమించాలంటూ గ్రామస్తులు గిరిజన సంఘాల నాయకులు బుధవారం ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు.. బ్యాంకులో రెగ్యులర్ మేనేజర్ లేకపోవడం వల్ల డ్వాక్రాకు సంబంధించిన మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికారులు స్పందించి నూతన మేనేజర్ ఏర్పాటు చేయాలని స్థానికులు,ఆదివాసి సంఘాల నాయకులు కోరారు..