కడప: 25 సంవత్సరాలుగా ఆర్కే నగర్ అభివృద్ధి పాలక ప్రభుత్వాలకు ఏమాత్రం పట్టడం లేదు: ఆర్ సి పి రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్
Kadapa, YSR | Oct 29, 2025 25 సంవత్సరాలుగా రామకృష్ణ నగర్ లో అభివృద్ధి పాలక ప్రభుత్వాలకు ఏమాత్రం పట్టడం లేదని, పోరాటాలతో నిర్మించుకున్న ప్రాంతం కనుకనే దీనిపైన సవతి ప్రేమ చూపుతున్నారని,ఓట్లు వేసిన ప్రజల రుణం తీర్చుకునే ఆలోచనే ఉంటే! తక్షణమే రోడ్లు, డ్రైనేజ్ కాలువలు నిర్మించాలని, రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి కోరారు. బుధవారం ఆర్ సి పి ప్రతినిధుల బృందంతో ఆ ప్రాంతంలో పర్యటించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.