సంగారెడ్డి: జాతీయ రహదారి విస్తరణ కొంతమందిని పనుల్లో అన్యాయం జరుగుతుందని స్థానికుల ఆందోళన
సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లి చౌరస్తా నుంచి కంది వరకు జాతీయ రహదారి విస్తరణ పనుల్లో అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ స్థానికులు మంగళవారం ఆందోళనకు దిగారు. జాతీయ రహదారుల అధికారులు ఇష్టానుసారంగా రోడ్డు ఒక వైపునే ఎక్కువ స్థలం తీసుకుంటున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరు సరికాదని, ఇష్టానుసారంగా పనులు చేస్తే అడ్డుకుంటామని స్థానికులు హెచ్చరించారు.