పాలకీడు: ఎత్తి పోతల పథకాల పనులు వేగవంతంగా, నాణ్యతగా జరగాలి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
కృష్ణ, గోదావరి జలాల పంపకంలో గత పాలకుల అశ్రద్ధ వల్ల తెలంగాణ రైతాంగానికి అన్యాయం జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.శుక్రవారం పాలకీడు మండలం పాలకీడు మండలం జానపాడు గ్రామంలో కృష్ణ నది పై నిర్మిస్తున్న జవహర్ జానపాడు లిప్ట్ ఇరిగేషన్,బెట్టేతండా గ్రామంలో మూసీనది పైన నిర్మిస్తున్న బెట్టేతండ స్కీం పనులను ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ జవహర్ జానపాడు లిప్ట్ ఇరిగేషన్ పనులు యుద్ధ ప్రాతిపదికన వేగవంతంగా, చేయాలని మంత్రి కాంట్రాక్టర్ ని ఆదేశించారు.