నిజామాబాద్ సౌత్: సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలకు విద్రోహ దినమే: PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్
సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలకు విద్రోహ దినమే అని PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ అన్నారు. మంగళవారం నిజామాబాద్ నగరంలో ఖిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో " 1948 సెప్టెంబర్ 17 విద్రోహ దినం" సదస్సు ను PDSU నగర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించటం జరిగింది. ఈ సందర్భంగా రాజేశ్వర్ మాట్లాడుతూ నాటి నిజాంనిరంకుశ పాలనకు కాశీంరజ్వీ ఆగడాలకు అకృత్యాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు నాయకులు పోరాటం చేశారని, దొరలు, భూస్వాములు,పటేల్, పట్వారిలు ,జమీందారులు దోపిడి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ప్రజలకు భూములు దక్కాలని తెలంగాణ సాయిధ పోరాటం నిర్వహించి లక్షల ఎకరాలను ప్రజలకు పంచారని గుర్తు చేశారు.