సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్య దర్శి ఏ.బి.బర్ధన్ 10వ వర్ధంతిని శుక్రవారం హిమాయత్నగర్లోని ఏఐటీయూసీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. బర్ధన్ జీవితాంతం కమ్యూనిస్ట్ సిద్ధాంతాలకు కట్టుబడి, కార్మికవర్గ సంక్షేమం కోసం పోరాడిన గొప్ప నాయకుడని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు