కనిగిరి: చల్ల గిరిగల గ్రామం వద్ద మోటార్ బైక్ ఢీకొని వ్యక్తి అక్కడికక్కడే మృతి
కనిగిరి: మోటార్ బైక్ ఢీకొని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన కనిగిరి మండలం చల్ల గిరి గల గ్రామం వద్ద సోమవారం రాత్రి చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చల్ల గిరిగల గ్రామానికి చెందిన మిట్ట వెంకటేశ్వర్లు అనే వ్యక్తి రోడ్డు దాటుతూ తన నివాసానికి వెళ్తుండగా, వేగంగా వచ్చిన మోటార్ సైకిల్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటేశ్వర్లు తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కనిగిరి ఎస్సై టి శ్రీరామ్ సంఘటన స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.