కనిగిరి పట్టణంలోని టీచర్స్ అకాడమీలో పదవ తరగతి విద్యార్థులకు గైడెన్స్ పై ఆదివారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కనిగిరి ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లా టిడిపి అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నర్సింహారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... పదో తరగతి విద్యార్థులు రానున్న పబ్లిక్ పరీక్షల్లో కష్టపడి చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని ఎమ్మెల్యే సూచించారు. పదోతరగతి తర్వాత ఉన్న విద్య అవకాశాలు, వాటి ప్రయోజనాలను విద్యార్థులకు ఎమ్మెల్యే వివరించారు.