యాడికి లోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్న విషయం తెలిసిందే. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ రోజు ఆదివారం రాత్రి గరుడ వాహనోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారు వాహనంపై విహరించారు. గరుడ వాహనోత్సవాన్ని తిలకించడానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. ఎక్కడ చూసినా భక్తుల సందడే కనిపించింది. ఆధ్యాత్మిక శోభ వెల్లి విరిసింది. గ్రామం మొత్తం జనసంద్రంగా మారిపోయింది.