మొంథా తుఫాను ఎఫెక్ట్ రంగారెడ్డి జిల్లాలోని ప్రభావం చూపుతోంది. షాద్నగర్ పట్టణంలో ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమైంది. మధ్యాహ్నాం నుంచి మోస్తరు వర్షం కురుస్తోంది. పనుల నిమిత్తం బయటకు వెళ్లిన ప్రజలు, వాహనదారులు వర్షం కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. కాగా, మరో 2, 3 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.