వేములవాడ: బ్రహ్మచారిణి అలంకారంలో శ్రీరాజరాజేశ్వరిదేవి అమ్మవారు
వేములవాడ రాజన్న ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం రెండో రోజు సందర్భంగా శ్రీరాజరాజేశ్వరిదేవి అమ్మవారు బ్రహ్మచారిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు,వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రంగురంగుల పుష్పలతో శోభాయమానంగా అమ్మవారు కనువిందు చేశారు. ప్రతి సంవత్సరం దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా చేస్తున్నట్లు అర్చకులు తెలిపారు.