ఒంగోలు అర్బన్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో లాడ్జిలను ముమ్మరంగా తనిఖీలు చేసి రికార్డులు పరిశీలించిన పోలీసులు
Ongole Urban, Prakasam | May 24, 2026
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆదివారం పోలీసులు లాడ్జిలను ముమ్మరంగా తనిఖీలు చేశారు. చెడ్డి గ్యాంగ్ కదలికల నేపథ్యంలో అసాంఘిక కార్యకలాపాలను నియంత్రించేందుకు ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలను పాటిస్తూ లాడ్జిలను తనిఖీ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. కొత్త వ్యక్తులకు గదులను అద్దెకి ఇచ్చే సమయంలో వారి పూర్తి వివరాలు ఆధార్ కార్డు సేకరించాలని పోలీసులు వెల్లడించారు. నేరచరిత్ర కలిగిన వ్యక్తులకు ఎట్టి పరిస్థితులలో గదులను అద్దెకు ఇవ్వరాదని అనుమానిక వ్యక్తులను గుర్తిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు.