నంద్యాల అర్బన్: జన గణ మన సందర్భంగా ఎవరైనా ఒరిజినల్ పత్రాలు అడిగితే ఇవ్వొద్దు : నంద్యాల మున్సిపల్ కమిషనర్ శేషన్న
Nandyal Urban, Nandyal | May 14, 2026
నంద్యాల పట్టణంలో జనగణన 2026 కార్యక్రమం కొనసాగుతుందని మున్సిపల్ కమిషనర్ శేషన్న తెలిపారు ఈ మేరకు బుధవారం ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించి జనగణన సంబంధించి వివరాలు సేకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో 323 మంది సిబ్బంది చేత జన గణ మన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు ప్రతి ఇంటికి వెళ్లి ఆన్లైన్ ద్వారా మాత్రమే వివరాలు సేకరిస్తారని తెలిపారు ఎవరైనా ఒరిజినల్ పత్రాలు అడిగితే ఇవ్వద్దని సూచించారు ఒరిజినల్ పత్రాలు అడిగినవారు అపరిచిత వ్యక్తులుగా గుర్తించి సమాచారం అందించాలని కోరారు