ఒంగోలు అర్బన్: మావిగన్ పేరుతో జగన్ పై ట్రోల్స్ చేయడానికి ఆగ్రహం వ్యక్తం చేసిన ఒంగోలు వైసిపి ఇన్ ఛార్జ్ చుండూరు రవిబాబు
Ongole Urban, Prakasam | Apr 10, 2026
ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు ఓల్డ్ వర్షన్ 2జీ అని మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి 5జి అని ఒంగోలు వైసిపి ఇన్ ఛార్జ్ చుండూరు రవిబాబు అన్నారు. శుక్రవారం ఒంగోలు వైసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చుండూరు రవిబాబు మావిగన్ పేరుతో జగన్ పై టిడిపి అనుకూల సోషల్ మీడియా ట్రోల్ చేయడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సమయంలో పారాషూట్ మాల్ టాబ్లెట్ పని చేస్తుందని జగన్ చెప్పిన మాటలే నిజమయ్యాయని అన్నారు. సారవంతంగా లేని భూములలో వరదలు వచ్చే ప్రాంతంలో రాజధాని పెట్టడం శ్రేయస్కరం కాదని అన్నారు.