తిరుమల ఎక్స్ప్రెస్ లో చోరీకి యత్నించిన బాలుడి అరెస్టు
రైలులో ప్రయాణికుడు కింద పడి గాయపడటానికి కారణమైన బాలుడని శుక్రవారం సాయంత్రం 7:00 అరెస్ట్ చేసినట్లు తాడేపల్లిగూడెం రైల్వేస్ సిఐఎస్ఐ లో శంకర్రావు, శ్రీహరిబాబు నిడదవోలులో తెలియచేశారు. భీమడోలు కు చెందిన దవులూరి జై సూర్య తిరుమల ఎక్స్ప్రెస్ లో వెళుతుండగా కొవ్వూరు వద్ద రాజమహేంద్రవరం పుష్కర్ ఘాటుకు చెందిన బాలుడు సెల్ఫోన్లు లాక్కునేందుకు ప్రయత్నించాడు. జై సూర్య కింద పెట్టడంతో గాయాలు అయ్యాయి.ఆ బాలుడిని తాడేపల్లిగూడెం పాత వంతెన వద్ద అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్లు ఎస్సై సీఐలు తెలియజేశారు..