నారాయణ్‌ఖేడ్: ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి SGF హ్యాండ్ బాల్ లో సత్తా చాటిన ఖేడ్ మైనారిటీ గురుకుల విద్యార్థులు
సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల మైదానంలో జరిగిన ఉమ్మడి మెదక్ జిల్లా SGF హ్యాండ్ బాల్ క్రీడల్లో ఖేడ్ పట్టణం లోని మైనారిటీ గురుకుల బాలుర పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. అండర్-19 విభాగంలో నలుగురు విద్యార్థులు ( ఇర్ఫాన్, శానవాజ్, ఆజన్, ఫయాజ్) ఉమ్మడి జిల్లా స్థాయిలో మంచి ప్రతిభ కనబరిచారని వీరు రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపిక అయినట్టు జిల్లా కళాశాలల SGF ప్రధాన కార్యదర్శి గణపతి, ధన్ రాజ్ తెలిపారు.