వరంగల్: ఇటీవల విద్యుత్ ఘాతంతో పూర్తిగా ఇల్లు దగ్ధమైన సురేష్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
వరంగల్ పశ్చిమ నియోజకవర్గం లోని వరంగల్ నగరంలోని 29వ డివిజన్ రఘునాథ్ కాలనీకి చెందిన ఎలుకల పెళ్లి సురేష్ ఇల్లు ఇటీవల విద్యుత్ ఘాతంతో పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాని రాజేందర్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఆర్థిక పరిస్థితిని తెలుసుకోండి ప్రభుత్వం నుండి డబుల్ బెడ్ రూమ్ ఇంటిని అధికారులతో మాట్లాడి ఇప్పిస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.