అసిఫాబాద్: ఆసిఫాబాద్ పట్టణంలో కమ్ముకున్న పొగమంచు
ఆసిఫాబాద్ మండలాన్ని పొగమంచు కమ్మేసింది. శనివారం ఉదయం 7:30 గంటల వరకు కూడా మంచు తెరలు వీడలేదు. ఎదురెదురుగా వాహనాలు కనిపించనంతగా వ్యాపించడంతో పాదచారులు, వాహనదారులు కొంత అవస్థలు పడ్డారు. వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణం సాగించారు. మరోవైపు పొగమంచు వల్ల పత్తి పూత, పిందె రాలిపోయే ప్రమాదం ఉందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.