బనగానపల్లె: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి :బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బనగానపల్లె మండలం యాగంటిపల్లె రోడ్డువైపు ఉన్న నూతన బైపాస్ రోడ్డుకు ఇరువైపులా ఆయన మొక్కలు నాటారు. పర్యావరణ సమతుల్యత కోసం చెట్ల పెంపకం ఎంతో అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వందల సంఖ్యలో మొక్కలను నాటనున్నట్లు పేర్కొన్నారు.