తాడిపత్రిలోని పలు ప్రాంతాల్లో సోమవారం బాణాసంచా దుకాణాలు, గోడౌన్లను పోలీస్, రెవెన్యూ, ఫైర్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. కడప రోడ్డు, ఎల్లనూరు రోడ్డు, నందలపాడు తదితర ప్రాంతాల్లోని బాణాసంచా దుకాణాలు, గోడౌన్లను క్షుణ్ణంగా పరిశీలించారు. భద్రతా చర్యలను పర్యవేక్షించారు. బాణాసంచా గోదాముల వద్ద జాగ్రత్తలు పాటించాలని నిర్వాహకులను ఆదేశించారు.