కామారెడ్డి: బాల్యవివాహాల నిర్మూలనకు పిలుపునిచ్చిన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణరెడ్డి
KMR : 12 నుండి 14 సెప్టెంబర్ 2025 వరకు ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన గ్లోబల్ ఇంటర్ ఫెయిత్ ప్లెడ్జ్ వీకెండ్ టు ఎండ్ చైల్డ్ మ్యారేజ్ కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి శాసనసభ్యులు వెంకట రమణ రెడ్డి పాల్గొని, బాల్యవివాహ నిర్మూలన కోసం ప్రతిజ్ఞ చేశారు, సాధన NGO సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. సంస్థ నుండి గిరిజా (జిల్లా కోఆర్డినేటర్) CSM లు పాల్గొన్నారు. బాల్యవివాహాలను నిర్మూలించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని, బాలికల విద్యాభివృద్ధి మరియు భవిష్యత్తు రక్షణకు ఇది ఒక ముఖ్యమైన అడుగు అవుతుందని తెలిపారు. చిన్నారుల హక్కులను కాపాడేందుకు సమాజం అంతా కలసి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.