జహీరాబాద్: రాంనగర్ లో వివాహిత అదృశ్యం, మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో వివాహిత అదృష్టమైనట్లు పట్టణ ఎస్ఐ వినయ్ కుమార్ తెలిపారు. పట్టణంలోని రామ్ నగర్ కు చెందిన మహాబీష్ అనే వివాహిత ఈ నెల ఐదున ఉదయం 11 గంటల సమయంలో ఇంటి నుండి వెళ్లి తిరిగి రాలేదని, బంధువుల వద్ద తెలిసిన వారి వద్ద వెతికిన ఆచూకీ లభ్యం కాలేదని ఆమె భర్త జీ లనుద్దీన్ గురువారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఎవరికైనా మహిళా ఆచూకీ తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.