గుంతకల్లు: పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న నారాయణ కళాశాలపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ విద్యార్థి విభాగం డిమాండ్
అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కళాశాల నిర్వహిస్తున్న నారాయణ కళాశాలపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు డిమాండ్ చేశారు. గుంతకల్లు పట్టణంలోని నారాయణ కళాశాలలో వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు గురువారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వైయస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంశియాదవ్ మాట్లాడుతూ గుంతకల్ పట్టణంలోని నారాయణ కార్పొరేట్ కళాశాల ప్రభుత్వ నిబంధనలను తుంగలోకి తొక్కుతూ ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలను పట్టించుకోకుండా కళాశాల నిర్వహిస్తోందని అన్నారు.