కడప: నగర శివారులోని జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్
Kadapa, YSR | Sep 26, 2025 ఇటీవల ఎంపికైన స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్లకు త్వరలో శిక్షణ ప్రారంభం కానున్న నేపథ్యంలో నగర శివార్లలోని జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రాన్ని (డి.టి.సి) శుక్రవారం జిల్లా ఎస్పీ శ్రీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారు సందర్శించారు. ఈ సందర్బంగా శిక్షణా కేంద్రంలోని వసతి ఏర్పాట్లను, తరగతి గదులను, కార్యాలయ గదులను, మైదానం, అంతర్గత రహదారులను, బాటిల్ అబ్స్టాకల్స్ ను పరిశీలించారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్.పి గారు డి.టి.సి ఆవరణలో మొక్కలు నాటి నీరు పోశారు.