ప్రముఖుల విగ్రహాల అవిష్కరణలో పాల్గొన్న కందుకూరు ఎమ్మెల్యే ఇంటురి నాగేశ్వర రావు....
టంగుటూరు మండలం మర్లపాడులో ఆదివారం జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు 18వ వర్ధంతిని పురస్కరించుకుని ఎమ్మెల్యే నాగేశ్వరరావు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం, మంత్రులు అనిత, రవికుమార్, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే కలిసి నందమూరి తారక రామారావు, పరిటాల రవీంద్ర, ఆంజనేయులు విగ్రహాలను ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ఆదివారం మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల ప్రాంతంలో జరిగింది.