ఆళ్లగడ్డ: ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలంలో:అమృతవల్లి అమ్మవారికి ఊయల సేవ
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం అమృతవల్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు, ఆలయ ఆవరణలో అమ్మవారికి పసుపు చందనం కర్పూరం వంటి లేపనాలు సమర్పించి తులసిమాలతో అలంకరించారు, ధూప దీపాలతో మహా మంగళహారతి అందించారు, సాయంత్రం ఉయ్యాలలో కొలువుంచి ఉయ్యాల సేవ జరిపారు, ఉయ్యాల సేవ కార్యక్రమాన్ని ఆలయ ప్రధాన అర్చకులు కిడంబి వేణు గోపాలన్ నిర్వహించారు