అనంతగిరి మండలం మద్ది గరువులో మంచినీటి సమస్య పరిష్కరించాలని గ్రామస్తులు వేడుకోలు #localissue
అనంతగిరి మండలం మద్దిగరువులో మంచినీటి సమస్య పరిష్కరించాలని గిరిజనులు డిమాండ్ చేశారు. గ్రామంలో సరైన తాగునీటి సౌకర్యం లేక కొండ కాలువల ద్వారా వచ్చే కలుషిత ఊట నీటితో గొంతు తడుపుకొని పలు రోగాల బారిన పడుతున్నామని వాపోతున్నారు. తాగునీటి సమస్య పై అధికారులకు ఎన్నోసార్లు విన్నవించినా పట్టించుకున్న దాఖలాలు లేవని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా కలెక్టర్ దినేశ్ కుమార్ స్పందించి మాకు మంచినీటి సమస్య పరిష్కరించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.