బనగానపల్లె: కనకాద్రి పల్లెలో 450 మంది రైతులకు నూతన పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన అధికారులు
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కనకాద్రిపల్లెలో 450 మంది రైతులకు ప్రభుత్వం మంజూరు చేసిన నూతన పాస్ పుస్తకాలను అధికారులు పంపిణీ చేశారు. గురువారం తహశీల్దార్ ఓటూరి షఫీ ఆధ్వర్యంలో ఆస్ఐ రంజిత్ గ్రామానికి చెందిన రైతులకు గ్రామసభ నిర్వహించి, రీ సర్వే ద్వారా మంజూరైన రాజముద్ర పుస్తకాలను అందించారు. టీడీపీ నియోజకవర్గ కన్వీనర్ వీఆర్ లక్ష్మీరెడ్డి, మాజీ సర్పంచ్ శివ శంకర్ పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు