గుంటూరు: చెత్తను రోడ్ల మీద, కాల్వల పక్కన, ఖాళీ స్థలాల్లో డంప్ చేయవద్దని హెచ్చరించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు
Guntur, Guntur | Sep 16, 2025 గుంటూరు నగరంలో చెత్తను రోడ్ల మీద, కాల్వల పక్కన, ఖాళీ స్థలాల్లో డంప్ చేయవద్దని, అలా వేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం కమిషనర్ నగరంలోని నగరంపాలెం, పాత గుంటూరు, కొత్తపేట పలు ప్రాంతాల్లో పర్యటించి, తీసుకోవాల్సిన చర్యలపై సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మంగళవారం సాయంత్రం ఒక ప్రకటన ద్వారా మాట్లాడుతూ ప్రజారోగ్య కార్మికులు తప్పనిసరిగా ఇంటింటి చెత్త సేకరణ నూరు శాతం చేసేలా వార్డ్ ల వారీగా శానిటేషన్ కార్యదర్శులు మరింత శ్రద్ధతో పర్యవేక్షణ చేయాలన్నారు.