డోన్: బేతంచర్ల మండలంలో మందుబాబులకు అడ్డాగా సంపద సృష్టి కేంద్రాలు
Dhone, Nandyal | May 31, 2026 నంద్యాల జిల్లాబేతంచెర్ల మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన సంపద సృష్టి కేంద్రాలు మందు బాబులకు నిలయాలుగా మారాయి.గూటుపల్లెలో 2018లో ఉపాధి పథకంలో భాగంగా రూ.4.71 లక్షలతో నిర్మించిన సంపద సృష్టి కేంద్రం నిరుపయోగంగా మారింది. తడి, పొడి చెత్తను వేరుచేసి వాటి నుంచి వచ్చే ఆదాయం గ్రామ అభివృద్ధికి ఉపయోగించాలన్న లక్ష్యం అధికారుల నిర్లక్ష్యంతో నీరుగారిపోతోంది.