అనంతపురం జిల్లా కూడేరు మండల పరిధిలోని కలగళ్ల గ్రామం వద్ద గురువారం రాత్రి ఉరుములు మెరుపులతో కూడిన వర్షంతో పాటు గాలిమరపై పిడుగు పడింది. గాలిమరపై పిడుగుపాటుకు పెద్ద ఎత్తున మంటలు చెలరేగి విండ్ టర్బైన్ ( గాలి మర ) మొత్తం మంటల్లో కాలిపోయింది. గాలిమర వద్ద సెక్యూరిటీ సిబ్బంది లేకపోవడం మూలంగా పెను ప్రమాదం తప్పింది. గాలిమరపై పిడుగు పడటంతో గాలి మర మొత్తం కాలిపోవడం మూలంగా కోట్లలో నష్టం వాటిల్లినట్లు కంపెనీ నిర్వాహక అధికారులు పేర్కొంటున్నారు.