బనగానపల్లె: బనగానపల్లె మండలం లో పేడ రంగు తాగి ఓ యువకుడు ఆత్మహత్య
ఇంటి ముందు కల్లాపు చల్లే పేడరంగు సేవించి యువకుడు మృతి చెందిన విషాదకర ఘటన బనగానపల్లె మండలం బీరువోలు గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బోయ మహేష్ (25) ఇంట్లో ఎవరూ లేని సమయంలో పేడ రంగు సేవించి ఆత్మహత్యకు పాల్పడినట్లు బనగానపల్లె పోలీసులు వెల్లడించారు. మృతదేహాన్ని బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.