ఒంగోలు అర్బన్: ఒంగోలు తులసి రామ్ థియేటర్ సమీపంలో మురుగు కాలములో పడి వ్యక్తి మృతి, దర్యాప్తు చేపట్టిన స్థానిక పోలీసులు
Ongole Urban, Prakasam | Jun 13, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలులో తులసి రామ్ థియేటర్ ఎదురుగా ఉన్న సోనీ హెయిర్ స్టైల్ వద్ద మురుగు కాలువలో పడి ఊపిరాడక వ్యక్తి చనిపోయాడు. రాత్రిపూట గస్తీలో ఉన్న ఎస్సై సుదర్శన్ ఈ కేసును విచారిస్తున్నారు. పొదిలి మండలం మంగాపురానికి చెందిన గోనుగుంట వెంకటేశ్వర్లుగా గుర్తించారు. ఒంగోలుకు పని నిమిత్తంపై వచ్చి మద్యం తాగి కాలువలో పడి మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు.