నారాయణపేట్: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ లక్ష్యాన్ని చేరుకోవాలి: కలెక్టర్ సిక్తా పట్నాయక్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలుకు అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. జిల్లాకు కేటాయించిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచి నెలలోపు పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. బుధవారం నాలుగు గంటల సమయంలో సింగారం చౌరస్తాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇండ్ల సమీక్ష సమావేశంలో కలెక్టర్ హాజరై మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఉండాలని అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.