శాంతిపురం మండలంలోని పరిధిలో 200 కుటుంబాలు బుధవారం వైసీపీ నుంచి టీడీపీలో చేరాయి. మండల పార్టీ అధ్యక్షుడు ఉదయ్ ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం కండువా కప్పి స్వాగతం పలికారు. పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని, కుప్పం అభివృద్ధి సీఎం చంద్రబాబుతోనే సాధ్యమన్న నమ్మకంతో ఇతర పార్టీల నుంచి భారీగా టీడీపీలోకి చేరుతున్నట్లు ఎమ్మెల్సీ తెలిపారు.