రాజేంద్రనగర్: వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో భర్తతో గొడవపడి ఉద్యోగానికి వెళ్లి తిరిగిరాని భార్య
ఉద్యోగానికెళ్లిన మహిళ తిరిగిరాని ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలిలా.. నల్గొండ (D) దేవరకొండకు చెందిన నూనె సైదులు (36), భార్య జ్యోతి(30) చింతలకుంటలోని అమ్మదయ కాలనీలో ఉంటున్నారు. నవంబర్ 3న రాత్రి వారిద్దరికీ గొడవ జరిగింది. నవంబర్ 4న ఆమె ఓ స్కూల్లో డ్యూటీకెళ్లి సా.5 వరకు తిరిగి రాలేదు. ఎక్కడ వెతికినా ఆచూకీలేదు. 5.4 అంగుళాల ఎత్తు, చామనఛాయా రంగు, లైట్ మరూన్ కలర్ డ్రస్ ధరించి ఉంటుంది