కనిగిరి: కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న ఏకైక కార్మిక సంస్థ CITU : సిఐటియు జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు
కనిగిరి పట్టణంలోని సుందరయ్య భవనంలో సిఐటియు కనిగిరి మండల 10 వ మహాసభలు ఆదివారం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన సిఐటియు జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు సిఐటియు జెండాను ఆవిష్కరించి మహాసభలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... సిఐటియు ఆవిర్భావానికి దారి తీసిన పరిస్థితులను వివరించారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న ఏకైక కార్మిక సంస్థ సిఐటియు మాత్రమే అన్నారు. కార్మికులు సంఘటితంగా పోరాటం చేసి సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.