చీమకుర్తి పట్టణంలోని పోలీస్ సర్కిల్ కార్యాలయం ఆవరణలో బుధవారం రౌడీషీటర్లకు సీఐ దాసరి ప్రసాద్ కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రౌడీ షీటర్లు తమ పాత నేర ప్రవృత్తిని విడనాడి, సమాజంలో సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. రౌడీ షీటర్ల పై నిరంతరం పోలీస్ నిఘా కొనసాగుతుందని, నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బెయిల్ పై తిరుగుతున్న రౌడీ షీట్లు మళ్లీ నేరాలకు పాల్పడితే వారి బెయిల్ రద్దు అవుతుందని సిఐ హెచ్చరించారు.