అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం ఉండబండ గ్రామంలో సోమవారం ఉదయం నుండి రాత్రి వరకు హజరత్ సయ్యద్ మహమ్మద్ నాగూర్ దాదావారి ఉరుసు కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. గంధం అనంతరం నిర్వహించబడే అత్యంత ప్రత్యేకతను కలిగిన ఉరుసులో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేసి దాదావారి ఆశీస్సులు పొందారు. ఉరుసు కార్యక్రమంలో భాగంగా అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ఉండబండ గ్రామ భక్త మండలి సభ్యులు నిర్వహించారు. ఉరుసు కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్త జనం తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేసి దర్శించుకున్నారు.