డోన్: ఉపాధి హామీ పనులతో దేవరబండ చెరువుకు పునర్జీవం
Dhone, Nandyal | May 17, 2026 జలధార-జలహారతి కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ పూడికతీత పనులతో డోన్ మండలం దేవరబండ చెరువుకు పునర్జీవం లభించింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రూ.5,83,634 నిధులతో పూడికతీత పనులు మంజూరు చేశారు. వారం రోజులుగా ప్రతిరోజూ 180 నుంచి 200 మంది ఉపాధి హామీ శ్రామికులు ఎర్రవంక, వీధులవంక కాలువల్లో పూడికతీత పనులు చేస్తున్నారు. రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.