మా బిడ్డను కాపాడండి సీఎం సారూ... దాతలకు వేడుకున్న తల్లి
సుండుపల్లె మండలం దిన్నెమీద బలిజపల్లి గ్రామానికి చెందిన 15 ఏళ్ల బోనంశెట్టి నాగచైతన్యకు బోన్ బ్లడ్ క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ అయ్యింది. చికిత్స ఖర్చు రూ.60 లక్షల వరకు అవుతుందని వైద్యులు తెలిపారు. ఆర్థికంగా బలహీన కుటుంబం చికిత్స భారం మోయలేక, తల్లి సుమలత రాష్ట్ర ప్రభుత్వం, దాతలు సహాయం చేయాలని వేడుకుంటున్నారు.