మార్కాపురం జిల్లా దోర్నాల పట్టణంలో బాణాసంచా సాపులు గోడంలపై ఎస్సై వెంకటరామయ్య అకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. కాకినాడ జిల్లాలో బాణాసంచా ప్రమాదం జరిగిన నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు. అనుముతులకు మించి నిలువ ఉంచిన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. భద్రతా నిబంధనలు పాటించాలని వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.